రాజస్థాన్‌లో కలవర పెడుతన్న జికా

106కు చేరిన కేసుల సంఖ్య
న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ కలకలం సషృ/-టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన కేసులు 106కు చేరుకున్నాయి. అయితే వైరస్‌ సోకిన వారిలో 25 మంది గర్భిణులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జైపూర్‌లో గురువారం కొత్తగా ఆరు కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌ బృందాన్ని రాజస్థాన్‌కు పంపించింది. జికా, డెంగ్యూ, చికున్‌గున్యా వైరస్‌ వ్యాప్తికి కారణమైన దోమల నివారణకు ఐసీఎంఆర్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారు. జైపూర్‌లోని సింద్‌ క్యాంపు, శాస్త్రీ నగర్‌ ప్రాంత దోమల నుంచి జికా వైరస్‌ను సేకరించినట్లు అధికారులు తెలిపారు. జికా సోకిన అందరికీ చికిత్స చేశామని, వారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రెగ్నెంట్‌ మహిళలు ఎవరూ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకూడదని వైద్య అధికారులు ఆదేశించారు.