రాజస్థాన్‌లో లలిత్‌మోదీ పాలన
రాజస్థాన్‌లో లలిత్ మోదీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. రాహుల్ రాజస్థాన్ పర్యటన రెండో రోజుకి చేరింది. అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఆయన లండన్‌లో ఉండి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజస్థాన్ ప్రభుత్వానికి రిమోట్ కంట్రోల్ లండన్‌లో ఉందని ఆయన ప్రస్తావించారు. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌మోదీకి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహాయం చేశారన్నారు. ప్రధాని నరేంద్రమోదీపైనా రాహుల్ పలు విమర్శలు చేశారు. ఈ విషయంలో ప్రధాని ఎందుకు నోరు మెదపరన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్, రాష్ట్రంలోని వసుంధర రాజే సర్కార్‌పై రాహుల్ ఫైర్ అయ్యారు. లలిత్‌మోదీ వ్యవహారంలో రాజే చట్టాన్ని ఉల్లంఘించారు. మోదీ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హావిూని కూడా నెరవేర్చలేదు. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అవినీతిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అవినీతి గురించి పెద్దపెద్ద మాటలుచెప్పిన మోదీ ఇప్పుడు ఎందుకు మాట్లాడరని అన్నారు.