రాజస్థాన్‌లో 68 శాతం రిజర్వేషన్లు

1

రాజస్థాన్‌ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి):

రాజస్థాన్‌ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం కారణంగా.. అక్కడి రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోయింది. అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది. దాంతో గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్‌బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లను ఇవ్వడానికి ఆమోదించారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన

్ల కోటా 68 శాతానికి చేరుకుంది. వాస్తవానికి చట్టప్రకారం గరిష్ఠంగా మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదు.    అయితే, తాము కొత్తగా ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా వాటికి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చూడాలని రాజస్థాన్‌లోని వసుంధర రాజె ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే..

అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే మొత్తం సవిూక్షించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చెప్పిన ఒక్కరోజు తర్వాతే రాజస్థాన్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.