రాజీవ్‌గాంధీకి ఘన నివాళి అర్పించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, జిల్లా కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.