రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కి వినతిపత్రం అందచేసిన బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు.

రఘునాథ పాలెం అక్టోబర్ 07 (జనం సాక్షి) తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లి కేసులు పాలైనా బంగారు తెలంగాణ లో కేసీఆర్ బాటలో నడుస్తున్నామని తమ డిమాండ్లను పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చాలని ఉద్యమకారులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు నామినేటెడ్ పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని కేసులు అనుభవించి జైలు జీవితం గడిపిన ప్రతి ఉద్యమకారుడికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. ప్రతి ఉద్యకారుడికి 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేయాలని కోరారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం వాటా కేటాయించాలని అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు.

మా యొక్క న్యాయమైన కోరికలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి మేనిఫెస్టోలో పెట్టేలా కృషి చేయాలన్నారు.

వెంటనే స్పందించిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఉద్యమకారులందరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు పగడాల నరేందర్ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రడం సురేష్ గౌడ్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు నందిగామ రాజ్ కుమార్ లాయర్ గుండ్లపల్లి శేషు విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు లింగనబోయిన సతీష్ యువజన విభాగం జిల్లా కార్యదర్శి నాగుల్ మీరా ఉద్యమకారులు దరిపల్లి వీరబాబు అసిఫ్ వసీం ఖాన్ చల్లపల్లి అజయ్ చారి బంక వెంకన్న గ్లోరీ గద్దల మరియ కుమారి మోగిలిచర్ల వెంకట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు