రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరం : ప్రధాని

న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో భాగంగా న్యాయపాలన వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఢిల్లీ అత్యాచార ఘటన అత్యంత క్రూరమైన ఘటనగా ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత న్యాయవ్యవస్థలో పలు మార్పులు చేయాల్సివచ్చిందని వివరించారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు రావాలని ఆకాంక్షించరు.