రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

3

హైదరాబాద్ : రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్, పాఠశాల, కమ్యూనిటీహాలు నిర్మాణంకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల స్థానంలో రూ.97.5 కోట్లతో నూతన గృహాలు, పాఠశాల, కమ్యూనిటీ నిర్మాణం చేపట్టనున్నారు. 185 మంది ఉద్యోగులకు ప్లాట్లు, 500 మంది విద్యార్థులకు పాఠశాల భవనం నిర్మించనున్నారు. 2017 అక్టోబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.