రాజ్ భవన్ ముట్టడికి వామపక్షాలు పిలుపు
హైదరాబాద్ : హెచ్ సీయూల వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. హెచ్ సీయూ వీసీని తక్షణమే తొలగించాలని.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు బర్తరఫ్ చేయాలని కోరారు. రోహిత్ చట్టం తేవాలని పట్టుబడుతున్నారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ జరుగనుంది. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ ని వామపక్షాలు త్రీవంగా ఖండిస్తున్నాయి.
సీపీఐ నేత నారాయణ..
‘అప్జల్ గురు ఉరికి జెఎన్ యూ విద్యార్థులకు సంబంధం లేదు. కన్హయ్యకుమార్ కు అప్జల్ గురు ఉరికి సంబంధం లేదు. గాంధీజిని చంపిన గాడ్సేకు ఆర్ ఎస్ఎస్, బీజేపీ వారు వారసులు. గాంధీజి వారసులు దేశభక్తులా… గాడ్సే వారసులు దేశభక్తులా.? విశ్వవిద్యాలయాలను వర్సిటీలుగా ఉంచుతారా.. లేదా పోలీసు క్యాంపసులుగా మార్చుతారా..? . మోడీకి భజన చేసే వారిని, వెంకయ్యనాయుడు చెంచాలను వర్సిటీ వీసీలుగా నియమిస్తున్నారు.
వీరు వీసీలు కాదు.. పశువులకు కాపాల కాయాలని’ ఎద్దేవా చేశారు.