రాజ్ భవన్ లో సాయిప్రణీత్‌కు గవర్నర్ సన్మానం
వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడలిస్ట్, అర్జున అవార్డులు దక్కించుకున్న సాయి ప్రణీత్ ను గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్ లోని ధర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో.. కోచ్ పుల్లెల గోపిచంద్ తో పాటు సాయి ప్రణీత్ సపోర్టింగ్ స్టాఫ్ హాజరయ్యారు. భవిష్యత్ లో సాయి ప్రణీత్ మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. వచ్చే ఒలింపిక్స్ లో మెడల్ సాధించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలువాలన్నారు గవర్నర్ ఆకాంక్షించారు.