రాణించిన రాజస్థాన్
జైపూర్ ఏప్రిల్ 29 (జనంసాక్షి) : జైపూర్‌లో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ముకుంద్ 21 బంతుల్లో 19 పరుగులు చేసి త్రివేది బౌలింగ్‌లో ఔటయ్యాడు. గేల్ కొద్దిసేపు రెచ్చిపోయి ఆడి వికెట్ కోల్పోయాడు. 16 బంతుల్లో 34 (6 ఫోర్లు, సిక్స్) పరుగులు చేసి వాట్సన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కొహ్లీ నిలకడగా ఆడి 35 బంతుల్లో 32 పరుగులు చేశాడు. వాట్సన్ బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చాడు. డివిల్లర్స్ 21, హన్రీక్యూస్ 22, తివారి 8(నాటౌట్), రామ్‌పాల్ 3, వినయ్‌కుమార్ 22 (నాటౌట్) పరుగులు చేశారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. శాంసన్ 63, వాట్సన్ 41, బాడ్ర్ హడ్జ్ 32, ద్రావిడ్ 22 పరుగులు చేశారు. బెంగళూరు బౌలింగ్‌లో రామ్‌పాల్ 2, ఆర్పీసింగ్, హెన్రిక్, వినయ్‌కుమార్ ఒక్కో వికెట్ తీశారు.
స్కోర్ వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఇన్నింగ్స్ :
ముకుంద్ (బి) త్రివేది19(4×1), క్రిస్‌గేల్ (సి) సమ్షన్ (బి) షేన్ వాట్సన్ 34(4×6, 6×1), విరాట్ కోహ్లీ (సి) ఫాల్కర్ (బి) షేన్ వాట్సన్ 32(4×3), డి విల్లియర్స్ (సి) ఫాల్కర్ (బి) శ్రీశాంత్ 21(21(4×3),హెన్రీ క్యూస్ రన్ అవుట్ ఫాల్కర్, సమ్సాన్ 22( 4×2, 6×1) తివారి నాటౌట్ 8, రవి రాంపాల్ (సి) సమ్సాన్ (బి) షేన్ వాట్సన్ 3, వినయ్ కుమాయ్ 22 (6×3)
ఎక్స్‌ట్రాలు : 10 (బైస్-0, వైడ్‌లు :3 ,నోబాల్-2, లెగ్ బై-5, ఫెనాల్టీ-0)
మొత్తం : 171 (20 ఓవర్లలో 6 వికెట్లకు) రన్ రేట్ : 5.33
వికెట్ల పతనం : 1-44 (క్రిస్‌గేల్ 3.6), 2-66 (ముకుంద 7.6), 3-99 ( డి విల్లియర్స్ 12.1), 4-123 (విరాట్ కోహ్లి 15.5), 5-145 (హేన్రీక్యూస్ 18.1) 6-149 ( రవి రాంపాల్ 18.6)
రాజస్థాన్ బౌలింగ్ : చాందిలా 4-0-39-0, ఫాల్కర్ 4-0-42-0, శ్రీశాంత్ 4-1-35-1, షేన్ వాట్సన్ 4-0-22-3, త్రివేది 3-0-20-1, బిన్ని 1-0-8-0
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ :
ద్రావిడ్ (బి) హేన్రీక్యూస్ 22 (4×4), రహానే (సి) ఆర్సీ సింగ్ (బి)రవి రాంపాల్ 2, సమ్సన్ (సి) మురళి కార్తిక్ (బి) రవి రాంపాల్ 63(4×7, 6×2), షేన్ వాట్సన్ (సి) డి విల్లియర్స్ (బి) ఆర్పీ సింగ్ 41 (4×3, 6×1), హోద్గే (బి) వినయ్ కుమార్ నాటౌట్ 32 (4×1, 6×2), బిన్ని నాటౌట్ 6 (4×1), సహ్ రన్ అవుట్ (డి విల్లియర్స్) ఫాల్కర్ నాటౌట్ 1.
ఎక్స్‌ట్రాలు : 5 (బైస్-0, వైడ్‌లు :3 ,నోబాల్-0, లెగ్ బై-3, ఫెనాల్టీ-0) మొత్తం : 173 ( 6 వికెట్లు 19.5 ఓవర్లకు) రన్ రేట్ : 7.95
వికెట్ల పతనం : 1-21( రహేనా 2.5), 2-48 (ద్రావిడ్ 6.4), 3-116( సమ్సాన్ 14.2), 4-162 (వాట్సన్ 18.3), 5-167 (హోడ్జే 19.2), 6-168 ( సాహ్3)
బెంగళూర్ బౌలింగ్ : రవి రాంపాల్ 4-1-28-2, ఆర్పీ సింగ్ 4-0-35-1, వినయ్ కుమార్ 3.5-0-39-1, హేన్రిక్యూస్ 2-0-6-1, మురళి కార్తిక్ 3-0-32-0, ఉండ్కాట్ 3-0-30-0.