రాతోని లిఫ్ట్ జంక్షన్ బావికి అక్రమ విద్యుత్ వాడకం

పెనుబల్లి, ఫిబ్రవరి 19(జనం సాక్షి)  మండల పరిధిలోని                          పెనుబల్లిరాతోని చెరువు లిప్ట్ జంక్షన్ బావికి  అక్రమ విద్యుత్ వాడటం వలన గ్రామంలో కరెంట్ కోతలతో నీటి ఎద్దడి ఏర్పడింద ని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పెనుబల్లి మండలం యడ్లబంజర్ గ్రామంలో రాతోని చెరువు నుండి వచ్చే లిప్ట్ వాటర్ కు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన జంక్షన్ బావి కి అక్రమంగా 10హెచ్పి మోటారు బిగించి 11కెవి సరఫరా చేసే కరెంట్ తీగలపై కొంతమంది వ్యక్తులు యదేచ్ఛగా అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్నారని, ఇలా చేయడంతో గ్రామంలో వున్న మంచినీరు సరఫరా చేసే మోటార్లు ఆన్ చేయగానే ట్రాన్స్ఫార్మర్ ట్రిప్పు అవుతున్నాయని, దీంతో అప్రకటిత విద్యుత్ కోతలు ఏర్పడి ఇళ్ళ కు నీరు సరఫరా అవ్వకపోవడంతో గత వారం రోజులు గా నీటి ఎద్దడి ఏర్పడింద ని, విద్యుత్శాఖ అధికారులు వెంటనే అక్రమ కనెక్షన్లను తొలగించి వారి పై చర్య తీసుకొని నీటి ఎద్దడిని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.