రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు •ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా జడ్పిటిసిల ఫోరం లీడర్ లింగమల్ల శారద
మహా ముత్తారం జులై 21 (జనం సాక్షి) రానున్న మూడు రోజులపాటు భారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే తప్ప ఇండ్ల నుంచి బయటికి రాకూడదని వాగులు, చెరువులు, పరిస్థితిని ఎప్పటికప్పుడు గ్రామస్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్పిటిసిల ఫోరం లీడర్ లింగమల్ల శారద కోరారు. శుక్రవారం మహా ముత్తారం మండల కేంద్ర సమీపంలో ఉన్న వాగు వరద పరిస్థితిని జడ్పిటిసి లింగమల శారద మరియు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీనివాస్ తో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి లింగం వల్ల శారద మాట్లాడుతూ వాగులు పొంగి ప్రవహిస్తున్న వాగులు చూస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అన్నారు. ప్రజలు దాటేందుకు ప్రయత్నించకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంలో పాటు వరద ఉదృత అధికంగా ఉన్న నేపథ్యంలో రాకపోకలు నిలిపివేయాలని అన్నారు. ఈ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగు జాగ్రత్తలుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గత వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని తాసిల్దార్ కు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉండాలని అన్ని గ్రామాలకు సంబంధించిన వాగులు వంకలు చెరువులు వరద నీరు ప్రవాహం ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఉండాలని అన్నారు. చెరువుల వద్దకు చేపల వేటకు వెళ్లకుండా గ్రామ శాఖ అధికారులకు సంబంధించిన సర్పంచులకు సమాచారాన్ని తెలియపరచండి అని తెలిపారు. వారి వెంట తాసిల్దార్ శ్రీనివాస