రాఫెల్‌ ఒప్పందాలను బహిర్గతం చేయాల్సిందే

ఇందులో దాయడానికి ఏముంది

ఇది రహస్యం కాదన్న ఫ్రాన్స్‌ ప్రధాని

బ్యాంకు కుంభకోణాలు,రాఫెల్‌ డీల్‌, ఆర్థిక వ్యవస్థపై ప్రజా ఉద్యమం

తప్పు చేశారు కాబట్టే నా కళ్లలోకి చూడలేకపోతున్నారు

బీదర్‌ సభలో ప్రధాని మోడీపై మరోమారు విరుచుకుపడ్డ రాహుల్‌

బీదర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): రాఫెల్‌ ఒప్పందాలను బహిర్గతం చేయాల్సిందేనని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోమారు డిమ ఆండ్‌ చేశారు. దీనివెనక ఉన్న మతలబు ఏంటో ప్రజలకు తెలియాన్నారు. దీనిని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కర్ణాటకలోని బీదర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాఫెల్‌ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘యూపీఏ హయాంలో రాఫెల్‌ ఒప్పందం గురించి ఫ్రాన్స్‌తో మాట్లాడాం. విూ టెక్నాలజీ ఉపయోగించుకుని భారత్‌లో యుద్ధవిమానాలు తయారు చేస్తాం. దీని వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుందనుకున్నాం. కానీ మోదీ అధికారంలోకి రాగానే.. రాఫెల్‌ ఒప్పందం మొత్తం మార్చేశారు. రాఫెల్‌ కొనుగోలుకు ఎంత ఖర్చయిందనే విషయాలను రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ దాచి పెడుతూఅబద్దాలు చెబుతున్నారని రాహుల్‌ ఫైర్‌ అయ్యారు. అదేమంటే రాఫెల్‌ కొనుగోలుకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచాలని ఫ్రాన్స్‌, భారత్‌ మధ్య ఒప్పందం ఉందని చెబుతున్నారు. కానీ అటువంటి ఒప్పందమేమి లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు స్వయంగా నాతో చెప్పారు. ప్రభుత్వం బయట పెట్టాలనుకుంటే రాఫెల్‌ ధర ఎంతో చెప్పొచ్చని అన్నారు. రాఫెల్‌ ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ప్రధాని మోదీ పక్కన అనిల్‌ అంబానీ ఉన్నారని, అందుకే యువతకు ఉద్యోగాలు రాకుండా అంబానీ లాక్కున్నారని అన్నారు. రాఫెల్‌ ఒప్పందంపై చర్చకు రావాల్సిందిగా మోదీకి చాలా సార్లు సవాల్‌ విసిరాను. కానీ ఆయన నా సవాల్‌ను ఎప్పటికీ అంగీకరిచరు. ఈ ఒప్పందం విషయంలో ఆయన దేశానికి అబద్దాలు చెబుతున్నారు. ఆయన ఎందుకు నా ప్రశ్నల నుంచి పారిపోతున్నారు’? అని రాహుల్‌ ప్రశ్నించారు. ‘మోదీ.. విూరు భారతదేశానికి ప్రధాని. అంతేకానీ 10-15 మంది పారిశ్రామికవేత్తలకు కాదు’ అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు. ‘మోదీ నా కళ్లలోకి సూటిగా చూడలేరు. ఎందుకంటే రాఫెల్‌ ఒప్పందం విషయంలో ఆయన అబద్దాలు చెబుతున్నారు. అందుకే చూడలేకపోతున్నారు. దాని గురించి కనీసం ఒక్క సెకన్‌ కూడా ఆయన మాట్లాడటం లేదు అని రాహుల్‌ మండిపడ్డారు. యూపీ, బిహార్‌ వసతి గృహాల్లో బాలికపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఆయన ప్రస్తావించారు. ‘యూపీ, బిహార్‌ ఘటనపై మోదీ ఒక్క మాట కూడా మాట్లడటం లేదు. ఈ అత్యాచార ఘటనల్లో నిందితులుగా ఉన్న వారిని రక్షించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు’ అంటూ రాహుల్‌ దుయ్యబట్టారు. భేటీ బచావో భేటీ పడావో నినాదాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే మన కూతుళ్లు ఎవరి నుంచి రక్షించుకోవాలో ప్రధాని చెప్పలేకపోతున్నారని రాహుల్‌ విమర్శించారు. ఇటీవల అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ కూడా రాహుల్‌.. ప్రధానిపై ఇదే తరహా విమర్శలు చేశారు. ప్రధాని మోదీ తన కళ్లలోకి చూడలేరని, ఆయన అందర్నీ చూస్తున్నారు, కానీ తన కళ్లలోకి మాత్రం నేరుగా చూడలేకపోతున్నారని రాహుల్‌ విమర్శించారు. దొంగతనానికి పాల్పడిన వారు తన కళ్లలోకి చూడలేరని రాహుల్‌ అన్నారు. రాఫెల్‌ కొనుగోలుపై చర్చకు ప్రధాని రావాలని మరోమారు డిమాండ్‌ చేశారు. ఎన్ని గంటలైనా తాను చర్చించేందుకు సిద్ధమని, కానీ ఆయన ఒక్క క్షణం కూడా మాట్లాడలేరన్నారు. బ్యాంకు కుంభకోణాలు, రాఫెల్‌ డీల్‌, ఆర్థిక వ్యవస్థపై ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు రాహుల్‌ తెలిపారు.