రాబోయే బడ్జెట్‌లో కొత్త విధానం : మంత్రి ఆనం

నెల్లూరు: రాబోయే బడ్జెట్‌లో కొత్త విధానాన్ని అమలుపరచనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ్‌రెడ్డి తెలిపారు. కొత్తగా ఉపసంఘాలు వేసి వాటి సూచనలను బడ్జెట్‌లో పొందుపరుస్తామన్నారు. ధర్మాన వ్యవహారంలో మంత్రివర్గ నిర్ణయంపై  గవర్నర్‌ న్యాయసలహాలు కోరిన మాట వాస్తవమేనని, అడ్వకేట్‌ జనరల్‌, న్యాయ వాదుల సూచనలు తీసుకొని నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలుపుతామని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం సూచనలమేరకే నడుచుకుంటామని మంత్రి తెలియజేశారు.

తాజావార్తలు