రామజన్మభూమి సమావేశంపై విద్యార్థి సంఘాల నిరసన

1
న్యూఢిల్లీ,జనవరి 9(జనంసాక్షి):ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ యూనివర్సిటీలో రామజన్మభూమి అంశంపై శనివారం సెమినార్‌ ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమైన ఈ సెమినార్‌కు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలైన ఆలిండియా స్టూడెంట్‌ అసొసియేషన్‌ (ఏఐఎస్‌ఏ), క్రాంతికారి యువసంఘటన్‌ (కేవైఎస్‌)తోపాటు నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. డీయూలోని ఆర్ట్స్‌ ఫాకల్టీ ప్రాంగణం ఎదుటు వారు ఆందోళన చేస్తుండగా.. రైట్‌ వింగ్‌ విద్యార్థులు కాన్ఫరెన్స్‌ సెంటర్‌ ఎదురుగా గుమిగూడి ‘జై శ్రీరాం’, ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో ¬రెత్తించారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దివంగత నేత అశోక్‌ సింఘాల్‌ స్థాపించిన అరుంధతి వశిష్ఠ అనుసంధాన్‌ పీఠం నిర్వహిస్తున్న ఈ సెమినార్‌ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రారంభించారు. సెమినార్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు ‘అసహనం’గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రామజన్మభూమిపై సుబ్రమణ్యస్వామి స్పష్టమైన ప్రకటన చేశారు. త్వరలో రామాలయనిర్మాణం చేస్తామన్నారు.