రామ్‌లీలాలో రావణ దహనం

పాల్గొన్న రామ్‌నాథ్‌, మోడీ
న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి సతీమణి జ్యోతి ప్రజ్వలన చేశారు. రామ,లక్షణ, హనుమ వేషధారులకు రాష్ట్రపతి, ప్రధాని తిలకం దిద్దడంతో వేడుకలు ప్రారంభమయ్యారు. మహిళా శక్తికి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపం విజయదశమి అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొన్న ప్రజలకు, కళాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కళాకారుల ప్రదర్శనల అనంతరం రావణుడి భారీ దిష్టిబొమ్మ దహనం కోసం ప్రధాని మోదీ బాణాన్ని సంధించారు. కుంభకర్ణ, మేఘనాథుల దహనం కూడా జరిగింది.