రాయికోడ్ లో రేపటి నుంచి ముమ్మాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

  రాయికొడ్ జనం సాక్షి సెప్టెంబర్25 రాయికోడ్ మండల కేంద్రంలో రేపటి నుంచి ముమ్మాదేవి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రగణం విద్యుత్ కాంతులతో వేదాజిమ్ముతుంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వతేది వరకు ప్రతి  రోజు ఒక రూపంలో అమ్మవారు దర్శనమీయనున్నారు. అలయకమిటి ఆధ్వర్యంలో నిర్వహించే శరన్నవరాత్రులలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు సఖరామ్ జోషి మరియు సందీప్ జోషి అమ్మవారికి 10 రోజులు 10 నిత్యపూజ అలంకారాలతో  దర్శనమివ్వనున్నారు. తొలిరోజు సెప్టెంబర్ 26 న శ్రీ బలత్రిపుర సుందరి దేవి 27న శ్రీ రాజరాజేశ్వరి దేవి, 28 న శ్రీ గాయత్రీ దేవి, 29 న శ్రీ అన్నపూర్ణాదేవి, 30 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, అక్టోబర్ 1 న శ్రీ మహాలక్ష్మిదేవి, 2 న శ్రీ సరస్వతీదేవి, 3 న శ్రీ మహాంకాలి దేవి, 4 న శ్రీ దుర్గాదేవి, 5వ తేదీ బుధవారం విజయదశమి రోజున   ముమ్మాదేవి అమ్మవారు గా దర్శనమివ్వనున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ మేలుకొలుపు తదుపరి అమ్మవారి అభిషేకం, అలంకరణ సేవ, మహానైవేద్యం అలాగే ప్రతిరోజు 11:30 నిమిషంలకు మంగలహారతి, ఇచ్చిన తదుపరి అమ్మవారి దర్శనం కొనసాగనుంది. అనంతరం తీర్థప్రసాదాలు వితరణ జరుగునని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.  అలాగే ప్రతిరోజు సాయంత్రం 6:30 నిమిషంలకు అమ్మవారి స్వరూపం అగు శ్రీ చక్రంనకు కుంకుమార్చన హారతి ఇవ్వబడునాని, అలాగే తేదీ 04-10-2022 మంగళవారం రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు మహాప్రసాదం అన్నదానం జరుగునని, సాయంత్రం 5:30 నిమిషాలకు అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు సేవ అనంతరం రాత్రి 10:30 నిమిషాలకు అమ్మవారి విగ్రహం తిరిగి దేవాలయం చేర్చి హారతి ముగింపు కలదని, మరుసటి రోజు విజయదశమి నాడు రాత్రి 10:00 గంటలకు మహాహారతి మరియు వేద సూక్తంతో అమ్మవారికి విశ్రాంతి కార్యక్రమం ఉంటుందని అలయకమిటి చైర్మన్ గుడ్ల లక్ష్మణ్ మరియు అర్చకులు సూచించారు. అలాగే అమ్మవారి దర్శనం విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అలయకమిటి సభ్యులు  ఏర్పాట్లు చేశారు.