రాయితీపై వ్యవసాయ పరికరాలు
నిజామాబాద్,జూలై26(జనంసాక్షి): వ్యవసాయ పెట్టుబడికి తోడు రాష్ట్రంలో వ్యవసాయంలో యాంత్రీకరణ
పరికరాలను రైతులకు రాయితీపై అందించనున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. రైతులు నూతన ఆధునాతన పరికరాలతో వ్యవసాయం చేస్తే, సమయంతో పాటు కూలీలు, పెట్టుబడి ఖర్చులు తక్కువ వుతాయని వివరించారు. వీటిపై రైతులకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం ఆగ్రోస్ ద్వారా రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.ఇదిలావుంటే వ్యవసాయ మార్కెట్ యార్డుకు నాణ్యమైన పంటనే రైతులు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశించారు. బుధవారం నిజామాబాద్ మార్కెట్ కమిటీలో వచ్చిన సరకును పరిశీలించారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు జరిపే ప్రత్యేక కేంద్రాన్ని విజయవంతంగా నడిపించాలని సూచించారు. అధికారులందరూ రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ-నామ్‌ను రైతులకు అందుబాటులో తెచ్చేలా చూడాలని వివరించారు.