రాయితీ విత్తనాలకు రంగం సిద్దం

నిజామాబాద్‌,మే29(జ‌నం సాక్షి): ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన రాయితీ విత్తనాల ధరలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని వ్యవసాయాధికారులు తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర సర్కారు అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను తీసుకొని రైతులు అధిక లాభాలు పొందాలని తెలిపారు.  తభూమిలో సారం పెంచేందుకు, రైతులకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టేందుకు పచ్చిరొట్ట విత్తనాలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. అందుకోసమే టీ సర్కార్‌ సీజన్‌కు ముందుగానే రైతులకు పచ్చిరొట్టె విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గత మూడు సంవత్సరాలుగా పచ్చిరొట్ట విత్తనాలను ముందస్తుగానే రైతులకు టీ సీడ్స్‌ అందజేయడం జరుగతుందన్నారు. ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన విత్తన ఇండెంట్‌కు అనుగూణంగా ఇప్పటికే ఆయా రకాల విత్తనాలను సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలకు చెందిన రైతాంగానికి విత్తనాల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగతుందన్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు అయిన పిల్లిపెసర, జీలుగు, జనుము రకాలు ఇప్పటికే సహకార సంఘాలకు చేరుకోవడం జరిగిందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు తమ మండల వ్యవసాయశాఖ అధికారితో పర్మిట్‌ తీసుకొని సొసైటీలలో రాయితీ విత్తనాలను తీసుకోవాలన్నారు.