రావత్‌ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు


` త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్న ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి
హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి): సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహామొత్తం 14మంది మృతికి కారణమైన హెలికాప్టర్‌ ప్రమాదంపై అన్ని రకాల కోణాల్లో విచారణ జరుగుతోందని ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి తెలిపారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ వచ్చిన తర్వాత వీవీఐపీల ప్రోటోకాల్‌లో మార్పుల చేస్తామని చౌదరి తెలిపారు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడవిూలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమిళనాడులోని కూనూరు వద్ద సంభవించిన హెలికాప్టర్‌ ప్రమాదంలో సీబీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికా రావత్‌, మరో పన్నెండు మంది వీర సైనికుల మృతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమా దం దేశంలో ఎంతో విషాదాన్ని నింపిందన్నారు. ఆ ప్రమాద ఘటనపై ఎంక్వైరీ కొనసాగుతోందని, ఈ రిపోర్టు ఆధారంగా భవిష్యత్తులో వీవీఐపీ ప్రయాణాలకు సంబంధించిన ప్రొటోకాల్‌ను రివ్యూ చేసి, మార్పులు చేర్పులు చేస్తామని అన్నారు. పాక్‌, చైనాల నుంచి ఉన్న ముప్పుపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఎంక్వైరీ సాగుతున్న సమయంలో ముందే ఎటువంటి కామెంట్‌ చేయలేమని అన్నా రు. అయితే ప్రతి కోణంలోనూ ఇన్వెస్టిగేషన్‌ జరగడం తప్పనిసరి అని, ఎక్క డ, ఎటువంటి పొరబాటు జరిగిందన్నది తేల్చి స్పష్టమైన రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉందని ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న కోర్ట్‌ ఆఫ్‌ ఎం క్వైరీ చాలా నిష్పాక్షికంగా జరుగుతోందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు.

తాజావార్తలు