రాష్ట్రంలోకి మావోయిస్టు మళ్ళొచ్చిండ్రా?!
` అటవీ సరిహద్దు గ్రామాల్లో సభు, సమావేశా ఏర్పాటు
` ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచరిస్తున్న సాయుధ దళాు
` అప్రమత్తమైన పోలీసు, విస్తృత గాలింపు
` గ్రామాల్లోకి రానీయొద్దని పోలీసు విస్తృత ప్రచారం
` అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాజీ ఉపయోగిస్తున్న పోలీసు
` పోలీసు నిఘా పెరగడంతో సందిగ్ధంలో గిరిజను
హైదరాబాద్,ఏప్రిల్ 7(జనంసాక్షి):ఒకప్పుడు మావోయిస్టుకు కంచుకోటగా మెగొందిన ఉత్తర తెంగాణ గతకొన్ని సంవత్సరా నుంచి స్థబ్దుగా ఉన్న విషయం తెలిసిందే. భూస్వామ్య పెట్టుబడిదారుతో పాటు అక్రమార్కును గడగడలాడిస్తూ కార్మిక, కర్షక, బడుగు బహీన వర్గాకు బాసటగా వర్ధిల్లిన పీపుల్స్ వార్ పార్టీ కాక్రమంలో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందినది. 1980, 1990 దశకాల్లో పోలీసు దగ్గర లేని కమ్యూనికేషన్ టెక్నాజీతో పాటు అత్యాధునిక ఆయధాను మావోయిస్టు ఉపయోగించారు. ప్రజ మద్దతుతో మావోయిస్టు బమైన ఉద్యమాను కొనసాగించారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యూహాత్మకంగా వ్యవహరించిన అప్పటి ప్రభుత్వం పన్నిన పన్నాగంలో చిక్కుకొని మావోయిస్ట్ పార్టీ చర్చ పేరిట భారీగా నష్టపోయింది. అయినప్పటికీ 2010 వరకు ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాు కొంత చురుకుగానే కొనసాగాయి. తదనంతరం కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాు ఉమ్మడి కార్యాచరణ రుపొంచించుకొని సమన్వయంతో అణచివేత చర్యకు దిగడంతో మావోయిస్టు కార్యకలాపాకు పూర్తిగా అడ్డుకట్ట పడిరది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా గోదావరి పరివాహక అటవీ ప్రాంతాలో మావోయిస్టు ఏమైనా కార్యకలాపాు నిర్వహించే ప్రయత్నాు చేసినప్పటికీ పోలీసు తమ వద్ద ఉన్న అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాజీ ద్వారా వారి చర్యను మొదట్లోనే అడ్డుకుంటున్నారు. తాజాగా గత కొన్ని నెల నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కడెం, ఉట్నూర్, ఆసిఫాబాద్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు దళాు సంచరిస్తున్నాయనే సమాచారం పోలీసు వర్గాలో కకం రేపుతుంది. మావోయిస్టు ముఖ్యంగా అటవీ సరిహద్దు గ్రామాల్లో సభు, సమావేశాు నిర్వహిస్తూ ప్రజాపోరాటాకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని పోలీసు కూడా కొట్టివేయడం లేదు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఇంటలిజెన్స్ వర్గా నివేదికతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికాయి ఎప్పటికప్పుడు పరిస్థితు సవిూక్షిస్తూ స్థానిక పోలీసు యంత్రాంగానికి సూచను చేస్తున్నారు. ఒకవైపు ప్రత్యేక పోలీసు దళాు గాలింపు చర్యు చేపడుతుండగా మరోవైపు స్థానిక పోలీసు కూడా అనుమానిత గ్రామాల్లో పర్యటిస్తూ మావోయిస్టును గ్రామాలోకి రానివ్వకూడదని, గ్రామాల్లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని కాపాడాని కోరుతున్నారు. ఇదిఇలా ఉండగా గ్రామాల్లో పోలీసు నిఘా పెరగడంతో ఎప్పుడేమి జరుగుతుందోనని గిరిజను ఆందోళన చెందుతున్నారు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు పోలీసు అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాజీ వినియోగిస్తుండటంతో మావోయిస్టు ప్రజా మద్దతును ఎలా కూడగడతారు, సానుభూతిపరుకు ఏ రకంగా భరోసా కల్పిస్తారనేది తేలాల్సివుంది. ఏదిఏమైనా కరోనా కోరు చాస్తున్న ఈ సమయంలో గిరిజను ఆందోళన చెందకుండా ఉండేందుకు సంయమనం పాటించాల్సిన భాద్యత ఇరువర్గాపైన ఉంది.