రాష్ట్రంలో అదనంగా శిశు వైద్యశాలలు

రాష్ట్రంలో అదనంగా మాతా శిశు వైద్యశాలల ఏర్పాటు మీద హైదరాబాద్ లోని  సచివాలయంలో సంబంధిత అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమీక్ష జరుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్యశాలల్లో అదనంగా మరికొన్ని మాతా శిశు వైద్యశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ వైద్యశాలల అభివృద్ధి మీద నగర ప్రజాప్రతినిధులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర నిధుల సమీకరణ, పెంపు కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు.

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమేష్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ ఐడిసీ ఎండి వేణుగోపాల్, కేసీఆర్ కిట్ల పథకం సీఈఓ సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.