రాష్ట్రంలో కరువుని పట్టించుకునేవారే లేరు: మండవ

హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్రమైన కరువు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా పట్టించుకునేవారే లేరని తెదేపా సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎప్పుడు అదికారంలోకి వచ్చినా రైతులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం కరవు పరిస్థితిని గుర్తించడానికి కూడా కేంద్రం సిద్ధంగా లేదన్నారు. జైపాల్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా గ్యాస్‌ కేటాయింపుల్లో అన్యాయం జరగడం దురదృష్టరమన్నారు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం విశ్రాంతి తీసుకోవడానికి, ఉల్లాసంగా ఆడుకోవడానికి అన్నట్లుగా ఉందని మండప విమర్శించారు. విద్యుత్‌ బోర్డును నిర్వీర్యం చేశారన్న ఆయన అధికారంలోకి రావడానికే దాన్ని ఉపయోగించుకున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఇప్పటికౌనా జ్యోకం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, కరవు సహాయక నిధులు, గ్యాస్‌ కేటాయింపులు చేయించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.