రాష్ట్రంలో ఖనిజసంపద వెలికితీయండి
– బయ్యారం, ఐరన్ ఓర్‌పై అధ్యయనం చేయండి
– కేంద్ర మంత్రి తోమర్‌తో సీఎం కేసీఆర్
హైదరాబాద్,జూన్22(జనంసాక్షి):
కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా జియాలజీ, మినరల్ సోర్స్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాల్లోని గనుల ద్వారా అపారమైన ఖనిజ సంపదను వెలికి తీసి జాతి అభివృద్ధికి ఉపయోగించే అంశంపై చర్చించారు. తెలంగాణలో ఉన్న గనులు, ఖనిజాల లభ్యతపై చర్చించారు. బయ్యారం గనులలో ఐరన్ ఓర్ నిల్వలపై అధ్యయనాన్ని త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. వరంగల్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్ యూనిట్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. తెలంగాణలో ఖనిజ సంపద, గనుల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో మరోసారి సమావేశం కావాలని కేంద్ర మంత్రి, సీఎం నిర్ణయించారు.