రాష్ట్రంలో భానుడి భగభగ
హైదరాబాద్, జనంసాక్షి: భానుడి ప్రతాపానికి రాష్ట్రం ఎండలో మండిపోతోంది. ఖమ్మం జిల్లా మణుగూరు ఓపేన్ కాస్ట్‌లో ఇవాళ అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్, రామగుండంలో అత్యదికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామ 44.5 రెంటచింతల, ఆదిలాబాద్, మెదక్, భద్రాచలం, నిజామాబాద్‌లలో 44 డిగ్రీలు, హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.