రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
హైదరాబాద్ సహా రాష్ర్టంలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ లో అమీర్ పేట్, ఎస్.ఆర్.నగర్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా పలుచోట్ల జల్లులు, మోస్తరు వర్షం కురిసింది.
ఆదిలాబాద్ టౌన్ తో పాటు జిల్లాలోని ముథోల్, కడెం మండలాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లో భారీ వర్షం పడింది. సిరిసిల్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మంథని, ముత్తారం, కమాన్ పూర్, మల్హార్ మండలాల్లో, వెల్గటూరు, ధర్మారంలో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా సిద్దిపేట, తూప్రాన్ లో రాళ్లవాన పడింది. పటాన్ చెరు, ఆర్‌సీపురం, తొగుట, సంగారెడ్డి, జగదేవ్ పూర్, వర్గల్, ములుగులో మోస్తరు వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో వర్షం వర్షం కురవగా, చేవెళ్లలో వడగండ్ల వాన పడింది. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం గౌరారం, కామారెడ్డి, జుక్కల్ లో మోస్తరు వర్షం కురిసింది.
రాష్ట్రంలో మరో నాలుగురోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.