రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ..ఇద్దరి మృతి

3

మరో 25మందికి నిర్ధారణ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): తెలంగాణలో మళ్లీ  ఈస్వైన్‌ ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు విూతి చెందారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఘటనలు చోటుచేసు కుంటున్నాయని వైద్యులు తెలిపారు.  సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్‌ప్లూ మృతి నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ స్వైన్‌ప్లూతో మృతి చెందింది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో బాధ పడుతూ ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం విదితమే. మొత్తంగా స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య మూడుకు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. మరో 25 మందికి నిర్ధారణ

గుజరాత్‌నూ వణికిస్తున్న స్వైన్‌ఫ్లో

గుజరాత్‌ రాష్ట్రంలో స్వైన్‌ఫ్లొ విజృంభిస్తోంది. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 169 స్వైన్‌ఫ్లొ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. కేవలం ఒక్క నెలలో 27మంది మృత్యువాతపడ్డారని వారు చెప్పారు. మిగిలిన వాళ్లు.. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో ఐదుగురికి స్వైన్‌ఫ్లొ సోకినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.