రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ అమ్మకంపై వామపక్షాల విమర్శ

నిజామాబాద్‌, నవంబర్‌ 12 : విద్యుత్‌ ఉత్పత్తికి ఎన్నో వనరులున్న వాటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటుందని వామపక్ష పార్టీలు విమర్శించాయి. కిరణ్‌కుమార్‌ సర్కార్‌ మెడలు వంచి పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు ఐక్యమత్యంగా ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. సోమవారం న్యూ అంబేద్కర్‌ భవన్‌లో సిపిఐ, సిపిఎం, న్యూడెమో క్రసీ, ఎంసిపియుల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్‌ చార్జీలు విద్యుత్‌ కోతలకు నిరసనగా నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయా పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు. సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రెటేరియట్‌ స భ్యులు డివి కృష్ణ, సిపిఐ రాష్ట్ర నాయ కులు రాంనర్సయ్యలు పాల్గొన్నారు. విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బొగ్గు, నీరు, గ్యాస్‌ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రైవేటు పెట్టు బడిదారులకు వీటిని తక్కువ ధరకు అప్పగించి మనం ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్తును కొను గోలు చేసుకొనే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. మనిషికి విద్యుత్‌ జీవనధారంగా మారిందని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే విద్యుత్‌ ఉత్పత్తి చేసి తక్కువ ధరకు అందించవల్సి ఉండగా అధిక ధరలకు కొనుగోలు చేసే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపిం చారు. రాష్ట్రంలో ధనవంతులే ఎక్కువ గా విద్యుత్‌ను వృధా చేస్తున్నారని విమ ర్శించారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు పెట్రోల్‌, డిజీల్‌, వంటగ్యాస్‌ ధరలు బస్‌చార్జీలు పెంచుతూ సామా న్యులపై మోయలేని భారం వేశాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని వారన్నారు. సి పిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సాగర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరులకు జోహార్‌లు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు యాదగిరి, కంజర భూమయ్య, కృష్ణ, భూమయ్యలు పాల్గొన్నారు.