రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ల తరలింపు
అన్ని రాష్టాల్రకు విమానాలో చేరవేత
న్యూఢల్లీి,జూలై13(జనంసాక్షి :): రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. దీంతో ’నిర్వచన్ సదన్’ నుంచి రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ మెటీరియల్ తరలింపు పక్రియ కొనసాగుతోంది. పుదుచ్చేరి, తెలంగాణ సహా 14 రాష్టాల్రకు అధికారులు తరలించారు. ఆయా రాష్టాల్రనుంచి వచ్చిన అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ మెటీరియల్ తీసుకువెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అసెంబ్లీ కార్యదర్శులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం తరలించే బ్యాలెట్ మెటీరియల్‌ను విమాన మార్గం
ద్వారానే తరలిస్తారు. ఆయా రాష్టాల్ర రాజధానులకు వెళ్లే విమానాల్లో ’మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో టికెట్ కొనుగోలు చేసి పంపిస్తారు. హిమాచల్ ప్రదేశ్, ఢల్లీి మినహా అన్ని రాష్టాల్రకు వాయుమార్గంలోనే బ్యాలెట్ మెటీరియల్‌ను తరలిస్తారు. ఈనెల 15వ తేదీ వరకు అన్ని రాష్టాల్ర అసెంబ్లీ భవనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు చేరవేస్తారు. ఇప్పటికే పలు రాష్టాల్రకు అందగా మిగిలిన రాష్టాల్రకు బుధవారం తరలించనున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ మొత్తం పక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కవిూషనర్ రాజీవ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం ఈనెల 21న పార్లమెంట్ హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ సమావేశాలను కూడా అదేరోజునుంచి ప్రారంభం కానున్నాయి.
ఎంపిలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు అసెంబ్లీల్లో ఓటు వేస్తారు.