రాష్ట్రస్థాయి పోటీలకు కోలారం పాఠశాల బాలిక
ఖమ్మం, నవంబర్ 6 : రాష్ట్రస్థాయి అండర్-14 పాఠశాలల క్రీడలకు ఇల్లందు మండలంలోని పోలారం ప్రాథమికోన్నత పాఠశాల బాలిక ఎంపికైంది. అండర్-14 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి అనే బాలిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. కరీంనగర్‌లో నిర్వహించనున్న ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణవేణి పాల్గొంటుంది. విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.