రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తా : కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
ఖమ్మం : రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తానని కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 30 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రాధాన్యతా క్రమంలో వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. రైల్వేలో నిధుల కొరత ఉందని దీంతో చార్జీల పెంపు అనివార్యమని చెప్పారు.