రాష్ట్రాన్ని కాపాడే బడ్జెట్ ఇది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం నాడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ. 2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రాష్ట్ర బడ్జెట్ స్వరూపం..
రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.
రూ. 43,402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్.

పూర్తి కేటాయింపులివే..
రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.
రూ. 43, 402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్
సంక్షేమం రూ.4,376 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ. 4,285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ. 1,215కోట్లు
పాఠశాల విద్య రూ. 29,909కోట్లు
ఉన్నత విద్యకు 2,326 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ. 18,421కోట్లు
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు
గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు
జలవనరులు రూ. 16,705 కోట్లు
పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు
ఇంధన రంగం రూ. 8,207 కోట్లు
ఆర్ అండ్ బీ రూ. 9,554 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక 322కోట్లు
పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు
పర్యావరణ, అటవీ రూ. 687 కోట్లు