రాష్ట్ర గవర్నర్ తమిళ సై చే ప్రముఖ కళాకారుడు డప్పు స్వామికి ఘనంగా మెమొంట్ తో సన్మానం

కోడేరు (జనంసాక్షి)  సెప్టెంబర్ 25 కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారులు ఎన్ డప్పు స్వామి రాజ్ భవన్ లో జరిగిన  బతుకమ్మ ప్రారంభోత్సవేడుకలో మైలారం డప్పు స్వామి కి ఘనంగా సత్కారం   మహిళా కళాకారుల కు డప్పు ప్రదర్శనలు నిర్వహించి కళాకారులచే డప్పు నృత్యం ప్రదర్శనలు ఇప్పించారు.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  విద్యార్థులచే బతుకమ్మ  సంబరాలు డప్పు డాన్స్ చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై  చేతుల మీదుగా డప్పు స్వామి కి  మేమొంట్ శాలువాతో సత్కరించారు. గవర్నర్ మాట్లాడుతూ మహిళా కళాకారులకు డప్పు శిక్షణ ఇచ్చి  కనుమరుగు అవుతున్న కళలను వెలికి తీసి ఈ సమాజంలో కళళకు జీవం పోస్తున్న కళాకారుడు ఎన్ డప్పు స్వామి ని సత్కరించడం సంతోషంగా ఉందని గవర్నర్ తమిళ సై పేర్కొన్నారు. కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన నల్లపాగ స్వామి డప్పు స్వామి  తను కళాద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఇంటి పేరు డప్పు స్వామి గా  పేరుపొందినటువంటి  కళాకారుడు డప్పు స్వామి గత 20 సంవత్సారాలు నుండి కళారంగంలో రాణిస్తూ భారత దేశంలో ఉన్నటువంటి అనేక రాస్ట్ర లలో హర్యానా పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ ఢిల్లీ తదితర రాష్ర్టాలలో కళాప్రదర్శనలు ఇచ్చి  ప్రోపేసర్ జయశంకర్ జాతీయ అవార్డు మరియు జానపద కళారట్ననేషనల్ అవార్డ్  జానపద కళహంస నేషనల్  అవార్డ్స్ పొందడం జరిగింది. కాబట్టీ గవర్నర్ ప్రశంసించడం జరిగింది.జానపద కళల కు జీవం పోస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖ అధిపతి నిరడు లింగయ్య కి అభినందనలు తెలిపారు.