రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి.

తొర్రూర్ 22 జూన్ (జనంసాక్షి ) (ఐ.ఎఫ్.టి.యు )తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఈనెల 26న హైదరాబాద్లోని మార్క్సు భవన్లో జరుగుతుందని దానిని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి రవి అన్నారు. నేడు తోరూర్ iftu కార్యాలయం ముందు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో,దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని చర్చించి భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలు నిర్వహించే పిలుస్తారని అన్నారు. స్కీమ్ వర్కర్లు రెండు లక్షల మంది ఉండగా 11 వేల మంది మాత్రమే సరి కాదని అన్నారు. నాలుగు కార్మిక కోడ్లు ఏర్పాటు చేసిన కార్మికులు పోరాడి సాధించుకున్న 46 కార్మిక చట్టాలు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. మోడీ తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాల వల్ల 40 కోట్ల మంది కార్మికులను కష్టాలు కలుగు విధానాలపై కెసిఆర్ ఎందుకు మాట్లాడటం లేదని అన్న అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై చర్చించడానికి ముప్పై మూడు జిల్లాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరవుతారని జయప్రదం చేయడానికి కార్మిక వర్గం సహకరించాలని అన్నారు.కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదని,సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుఆయన అని ప్రశ్నించారు. ఇంకా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు దేశ ద్రోహంకరమైన అనేక చట్టాలు పైన సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఏరియా కమిటీ కార్యదర్శి కే సంపత్ కమిటీ నాయకులు చింత నవీన్ ఆరపల్లి వెంకన్న రాశాట్టి రాజశేఖర్ వేల్పుగొండ మహేందర్ బాలు శ్రీను తదితరులు పాల్గొన్నారు..