రాష్ట్ర డిజిపి నెలవారి సమీక్షా సమావేశం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి); రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ శనివారం పోలీస్ కమిషనర్ లతో, అన్ని జిల్లా ల ఎస్పీ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జులై నెలకు సంభందించిన కేసుల పై సమీక్ష నిర్వహించి, యూనిట్ ల వారీగా ఫంక్షనల్ వర్టికల్ పర్ఫార్మెన్స్ ను పరిశీలించారు.ఈ కాన్ఫరెన్స్ జిల్లా ఎస్పీ కె.సృజన, అదనపు ఎస్పీ ఎన్.రవి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా డిజిపి మాట్లాడుతూ ప్రజలకు భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీస్ అధికారులకు తెలియజేశారు.
నిషేధిత మత్తు పదార్థాల విషయంలో ప్రత్యేక దృష్టి కనబరచాలని తెలియజేశారు.
పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని , పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కేసుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు.సైబర్ నేరాలపై ప్రజలకు నిత్యం అవగాహణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి,ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నరో వివరిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.మహిళలు,
చిన్న పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడే వారికి త్వరితగతిన చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వచ్చే నెల జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయటం గురించి యూనిట్ అధికారులకు పలు సూచనలు చేశారు.ఫంక్షనల్ వర్టికల్ పనితీరును జిల్లా ల వారిగా పరిశీలించారు. జులై నెల కు సంభందించి కమ్యూనిటీ పోలీసింగ్, పిటీషన్ డిస్పోసల్ వర్టీ కల్స్ లలో జోగుళాంబ గద్వాల జిల్లా మొదటి స్థానం లో నిలవడం పై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి అదనపు డీజీపి సి .ఐ.డి మహేష్ భగవత్, ఐ జి లు షాన్ వాజ్ ఖాసీం,చంద్రశేఖర్ రెడ్డి,గద్వాల నుండి డి. ఎస్పీ పి. వెంకటేశ్వర్లు, గద్వాల, ఆలంపూర్, శాంతి నగర్ సి. ఐ లు శ్రీనివాస్, రాజు, శివ శంకర్, డీసీ ఆర్బి ఇన్స్పెక్టర్ రామ స్వామి, ఎస్సై లు రజిత, విక్రమ్ పాల్గోన్నారు.