రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలి సిపిఐ డిమాండ్

విశాఖపట్నం సీతమ్మధార.

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సీతమ్మ ధార జంక్షన్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు .. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యవర్గం సమితి సభ్యులు జి వామన మూర్తి,పడాల గోవింద్ లు మాట్లాడుతూ ప్రజల పై ఆర్థిక భారం వేసే విధంగా ఇల్లు,ఆస్తి, చెత్త, నీటి పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రమాదకరంగా ఉన్న రోడ్లను పక్కాగా వేయాలని డీజిల్ పెట్రోల్ ధరలు మీద భారీగా పన్నులు పెంచి 1200 కోట్ల రూపాయలు వసూలు చేసి రెండేళ్లయినా నేటికీ పక్కా రోడ్ల నిర్మాణం లో ఘోరంగా విఫలమయ్యా యని మండిపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు పెంచిన ఆస్తి పన్నును రద్దు చేయుటకు ప్రభుత్వ విధానాలపై యుద్ధానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్ మధు రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, రావి కృష్ణ,అడ్డురి శంకర్,బాలు,శ్రీను,రాము,బుజ్జి తదితరులు పాల్గొన్నారు….