రాష్ట్ర బులియన్ మార్కెట్‌లోకి ‘రిద్ధిసిద్ధి’
హైదరాబాద్, జనంసాక్షి: దేశియ బులియన్ ట్రేడింగ్ సంస్థ రిద్ధిసిద్ధి బులియన్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్వల్ప విలువ గల బంగారం కడ్డీలను ఈ సంస్థ ఇ-కాయిన్స్ రూపంలో ప్రజలకు అందించేందుకు హైదరాబాద్‌లో సేవల్ని ప్రారంభించింది. భారత్‌లో వినియోగం అవుతున్న బంగారంలో 40 శాతం మేర దక్షిణాది రాష్ట్రల్లోనే ఉంటోందని రిద్ధి సిద్ధి బులియన్స్ మేనేజింగ్ పృథ్వీరాజ్ కొఠారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పసిడి కొనుగోళ్లు భారీగా ఉండటంతో తమ వ్యాపార అవకాశాల్ని ఈ ప్రాంతంలో విస్తరించనున్నట్లు కొఠారి తెలిపారు. ఒక గ్రామం నుంచి ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ విధానంలో ఖాతాలు, కమీషన్, నిర్వహణ ఛార్జీలేవి