రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాట్మింటన్ పోటీలకు
ఖమ్మం, అక్టోబర్ 25 : స్కూల్ గేమ్స్, ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్-19 బాల్‌బ్యాట్మింటన్ పోటీలకు బొమ్మ పాఠశాల విద్యార్థిని తేజస్వి ఎంపికైంది. ఈ నెల 27 నుండి చిత్తూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొనే తేజస్వినిని పాఠశాల చైర్మన్ రాజేశ్వరరావు, వైస్‌చైర్మన్ సత్యప్రసాద్, కార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ మాధవి, ప్రిన్సిపాల్ నాగప్రవీణులు తేజస్వినిని అభినందించారు.