రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా
పీసీ ఘోష్ ప్రమాణం
హైదరాబాద్, డిసెంబర్ 12 (జనంసాక్షి) :
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటు పడతానని ఘోష్ ఇంగ్లిష్‌లో దైవసాక్షిగా ప్రమాణం
చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి, హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ కక్రూ, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, డీజీపీ దినేశ్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ జూన్ 25 నుంచి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూర్తి స్థాయి చీఫ్ జస్టిస్‌గా ఆయన ఇటేవలే నియమితులయ్యారు.