రాహుల్‌కు అధ్యక్ష పగ్గాలు
జైరాం రమేశ్
హైదరాబాద్ల్,మే20(జనంసాక్షి): ఎన్నికల హావిూల అమలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలయ్యాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ఒక్క పొలిటికల్ మార్కెటింగ్ తప్ప, ఏడాది కాలంలో మోదీ సాధించిందేవిూ లేదని జైరాం వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ విూడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏక వ్యక్తి పాలన సాగుతోందని, సొంత ప్రతిష్ట కోసమే మోదీ ఆరాటపడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఈ ఏడాదిలోగా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను చేపడతారని జైరాం రమేష్ తెలిపారు.గుత్తా సుఖేందర్‌రెడ్డి రాసిన లేఖపై స్పందిస్తూ గుత్తా లేఖతో పార్టీకి సంబంధంలేదని తెలిపారు. మోదీ ఏడాది పాలనలో చేసిందేవిూ లేదన్నారు. క్లీన్ ఇండియా బదులు, కిల్ ఇండియా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వ్యతిరేకించిన జీఎస్‌ఈ, అమెరికాతో ఒప్పందం వాటిని అమలు చేయడమే మోదీ యూటర్న్‌కు నిదర్శనమన్నారు. ఎన్డీయే కాస్త ఇప్పుడు మోదీ నాన్ డెమెక్రటిక్ అలియన్స్‌గా మారిందని ఆయన అన్నారు. ప్రత్యేక ¬దా విషయంలో ఏపీ ప్రజలకు కూడా ప్రధాని ద్రోహం చేస్తున్నారని జైరాం రమేష్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని జోస్యం చెప్పారు. మోదీ విధానాలన్నీ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని నష్టపరిచేవే అని అన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్ అందుకు నిదర్శనమని జైరాం రమేష్ ధ్వజమెత్తారు. విద్యా, ఆరోగ్యం, సాగునీరు, మహిళా శిశుసంక్షేమం వంటి రంగాల్లో కేటాయింపులు తగ్గాయని అన్నారు.ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా అనేది కాంగ్రెస్ విధానమని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపీకి ప్రత్యేక ¬దా వద్దంటూ ప్రధానికి లేఖ రాయడం సరికాదన్నారు. ఆయనపై చర్యలు తీసుకునే వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్నారు.