రాహుల్ ఇక్కడ
న్యూయార్క్ , సెప్టెంబర్28(జనంసాక్షి):
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమెరికాలోని కొలరాడోలో ఉన్న ఆస్పెన్ ఇన్‌స్టిట్యూట్‌లో కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో లాగానే రాహుల్ మళ్లీ కనిపించకుండా పోయారంటూ భాజపా నేతలు పలు విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు తెరదించుతూ ఈరోజు రాహుల్ తాను ఆస్పెన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఫొటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీపై ఆస్పెన్ కాన్ఫరెన్స్‌లో పలు ఆసక్తికర విషయాలు చర్చించారు’ అని రాహుల్ పేర్కొన్నారు.