రాహుల్‌ పర్యటనతో ఒరిగేదేవిూ లేదు

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరన్న మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్‌ను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోమని ప్రకటన

నల్లగొండ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటనతో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏవిూలేదని స్పష్టం చేశారు. రూ. 5 కోట్ల ఖర్చుతో కొత్తగా నిర్మించిన జిల్లా పరిషత్‌ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. నల్లగొండలో జిల్లా పరిషత్‌ భవనాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. జోకర్లు, బ్రోకర్లను పార్టీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. వారికి మానసిక స్థితి సరిగ్గా లేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటువంటి వారు చేరాల్సింది టీఆర్‌ఎస్‌ పార్టీలో కాదు.. మానసిక వైద్యుడి దగ్గర అని చెప్పారు. రాహుల్‌ గాంధీ పర్యటనను రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని తెలిపారు. విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో ఆదరణ లేదని మంత్రి తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమోనని ప్రజలు భయపడ్తున్నారని జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ వందల మంది విద్యార్థుల్ని చంపిందని, ఇప్పుడు రాజకీయాలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారన్న వార్తలపై మంత్రి స్పందించారు. కోమటిరెడ్డి లాంటి బ్రోకర్లు, జోకర్లను పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చిచెప్పారు. మతి స్థిమితం బాగాలేని కోమటిరెడ్డి హాస్పిటల్‌ లో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ బాలు నాయక్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌, వేముల వీరేశం, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు