రాహుల్‌ ప్రచారం కలసి వచ్చేనా?

కర్నాటక ఎన్నికలు కాంగ్రెస్‌,బిజెపిలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎవరికి వారు విజయం కోసం పోటీపడి ప్రచారం చేస్తున్నారు. చివరకు కాబోయే ప్రధానిని తానే అని రాహుల్‌  ప్రకటించడం ద్వారా కన్నడ ఓటర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మోడీ పనితీరును ఎండగడుతున్నారు. వాగ్దానాలను వసి/-మరించారని తూర్పారా బడుతున్నారు. అయితే  ప్రధాని మోడీ  కూడా కాంగ్రెస్‌ను ఎదురు దాయి చేయడంతోనే సరిపెట్టారు. మొత్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పక్కకు పోయాయి. బిజెపి కూటమి 2014 తర్వాత పలు కీలక రాష్ట్రాల్లో ల్లో కూడా దూకుడుగా ప్రదర్శిస్తూ ఒక్కో రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటూ వస్తోంది. ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ నినాదాన్ని మోడీ నినిదిస్తున్నారు.  దేశంలో చాలా రాష్ట్రాల్లో  ప్రాంతీయ పార్టీలకన్నా వెనకబడిపోయిన కాంగ్రెస్‌ అనతికాలంలోనే పుంజుకుంటున్నట్లు కనబడుతోంది. కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన రాహుల్‌ గాంధీ నేతృత్వంలో బలం పుంజుకొనే దిశగా అడుగులు వేయగలుగు తోందంటే ఆ పుణ్యం మోడీ సర్కారుకే దక్కుతుంది. పదేళ్ల యుపిఎ పాలనలో అమలు జరిగిన విధానాలు ప్రజల స్థితిగతులను దిగజార్చాయి. అవినీతి కుంభకోణాలు బద్దలై బయటపడ్డాయి. ఫలితంగా ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని మోడీ తనదైన తరహా ప్రచార్భాటంతో కర్నాటకలో కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని చూస్తున్నారు. మొత్తంగా అటు రాహుల్‌, ఇటు మోడీ ప్రచారాలు కర్నాటకను వేడెక్కిస్తున్నాయి. ఇందుకోసం  దాదాపు అన్ని రాష్ట్రాల చి బిజెపి, కాంగ్రెస్‌కు చెందిన నేతలంతా కర్ణాటకలో మోహరించి తలపడుతున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం నుంచి ఆ పార్టీని పెకిలివేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకోసం మోదీ తన ప్రచారాన్ని ఉధృతం చేసి అన్ని రకాల వాగ్బాణాలు సంధిస్తున్నారు. కర్ణాటకలో సిద్దరామయ్యపై కంటే, రాహుల్‌ గాంధీపై, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అక్రమాలపై విమర్శల వర్షం కురిపించడం ద్వారా మోదీ కర్ణాటక ఎన్నికలను జాతీయ స్థాయి సమరంగా మార్చివేశారు.  దేశాన్ని పట్టి పీడిస్తున్న కీలకమైన అంశాలపై పార్లమెంట్‌లో చర్చించకుండా ప్రతిపక్షాలపై నింద మోపి తప్పించుకున్న ప్రధాని మోడీ ఎన్నికల్లో మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.  దేశమంతా ప్రకంపనలు రేపిన కథువా, ఉన్నావా ఘోరాల గురించి లేదా నోట్లరద్దు, జిఎస్టీ గురించి సమాధానం రావడం లేదు. అధికారం కేంద్రీకృతం చేసుకోవడాన్నీ, నియంతృత్వ వైఖరిని ప్రదర్శించడాన్నీ కాంగ్రెస్‌ ఎండగడుతోంది.  మోదీ హయాంలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుం దని ఆక్రోశిస్తున్న పట్టించుకోవడం లేదు. యుపి, మధ్యప్రదేశ్‌ రాజస్థాన్‌లలో జరిగిన ఉపఎన్నిక ల్లో బిజెపి ఓటమిని కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా రాహుల్‌ ప్రస్తావిస్తున్నారు. అయినా ఎందుకనో ఈ సమ్యలు ప్రజలకు ఎక్కడం లేదు. యడ్యూరప్ప, గాలిజనార్దన్‌ రెడ్డి లాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారి గురించి ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు.  మోదీని దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ ఇవన్నీ ఉపయోగించు కుంటోంది. అయినా కర్ణాటక బరిలో  మోదీ జంకే పరిస్థితిని కల్పించేందుకు తగిన విధంగా కాంగ్రెస్‌ ప్రచారం చేయలేకపోతున్నదన్నది కనిపిస్తోంది.కర్ణాటకలో సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్‌ మరోమారు అధికారంలోకి వస్తుందన్న విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. ప్రతి కాంగ్రెస్‌ నేతా ఈ విషయం ఆత్మవిశ్వాసంతో చెప్పారు. తర్వాతి రోజుల్లో వారిస్వరం కొంత బలహీనపడింది. ఏదోరకంగా పూర్తిమెజారిటీ సాధించి గట్టెక్కుతాం.. అని చెప్పడం మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో తమకే మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పేవరకూ వచ్చారు. ఇప్పుడు తమకే అత్యధిక సీట్లు వస్తాయంటున్నారు.  నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా దిగడంతో ఇప్పుడు బిజెపిలో విశ్వాసం పెరిగింది. అలాగే సర్వేలు కూడా 
బిజెపికి అనుకూలంగా వస్తున్నాయి.  గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేతలకు  మోదీ  ప్రచారంతో ముచ్చెమటలు పడుతున్నాయి.  జనతాదళ్‌ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీకి ఓటు వేయమని బిజెపి ఓటర్లని ప్రేరేపిస్తున్నారు.. సూక్ష్మస్థాయిలో బూతుల నిర్వహణ జరుగుతోంది..మత ప్రాతిపదికన ఓటర్లను చీలుస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు.అందుకే ఇప్పుడు కర్నాటక ఎన్నికల తీరు జాతీయరాజకీయాల స్థాయికిచేరాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే పరిణామాల గురించి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. దేశంలో సార్వత్రక ఎన్నికల ఫలితాల తర్వాత సంకీర్ణప్రభుత్వం ఏర్పడక తప్పదని బిజెపితో సహా అన్ని పార్టీలు నిర్ణయించుకుంటున్నట్లు కనపడుతోంది. బిజెపిని ఇక్కడ ఓడిస్తే దేశంలో మిగతా ప్రాంతా/-లలో కూటమి కట్టయినా గెలవాలన్నది కాం/-గరెస్‌ వ్యూహంగా ఉంది. అందుకే రాహుల్‌, సోనియాలు కూడా ప్రచారంలో దిగారు. అందుకే తదుపరి ప్రధాని తానే అని రాహుల్‌ ప్రకటించుకున్నారు. ప్రజలకు ఇలాగైనా నమ్మకం కలిగించాలని చూస్తున్నారు. ప్రచార వ్యూహంలో గెలిచిన వాడే ఎన్నికల వ్యూహంలో గెలుస్తాడు.  మోదీకి వ్యతిరేకంగా బలంగా మాట్లాడుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి అవకాశం లేకుండా  శాయశక్తులా ప్రయత్ని స్తున్నారు. కర్ణాటక మోదీని నిలబెడుతుందా, రాహుల్‌ను నిలబెడుతుందా అన్నది చూడాలి. దీనిని బట్టే తదుపరి దేశ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.