రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు

కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రైతులు, ప్రజలు లక్షలాదిగా భారత్ జోడో యాత్రలో స్వచ్ఛందంగా వస్తున్నారని, అధిక ధరలు, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఏకతాటిపై తేవడానికి రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర లో మువ్వన్నెల జెండా రెపరెపల మధ్య, దారి పొడవునా లక్షలాదిమంది కార్యకర్తలు, అభిమానుల నినాదాలు, డబ్బు వాద్యాలు, పోతురాజుల విన్యాసాలు, బోనాలతో మహిళల ఊరేగింపు నడుమ సందడి వాతావరణం లో రాహుల్ గాంధీ జోడోయాత్ర విజయవంతంగా సాగుతోందని, భారతదేశ మొత్తం రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర పై ప్రశంసలు కురిపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్తుకు భరోసానిస్తూ భారత్ జోడోయాత్ర దిగ్విజయంగా సాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను విచ్ఛిన్నం చేస్తున్నారని దేశ ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమాలు చేపట్టడం లేదని ఒక్క రాజకీయ కోణంలోనే కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగుతుందని విమర్శించారు కరోనా మహమ్మారితో దేశం మొత్తం కకావికులమైందని నోట్ల రద్దు, జిఎస్టి, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యవసరల ధరల పెంపుతో సామాన్య ప్రజల బతుకుదెరువు కష్టమైందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సరిగా పనిచేయడం లేదని రైతులను ప్రజలను యువకులను మోసం చేస్తూ ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శించారు రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టుతోందని మళ్లీ ఇందిరా, రాజీవ్ గాంధీల రామరాజ్య పరిపాలన రాహుల్ గాంధీ నేతృత్వంలో రాబోతోందని ప్రజలు రాహుల్ గాంధీకి మద్దతు తెలపాలని పేర్కొన్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి దాదాపు తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న అభివృద్ధి శూన్యం అని విమర్శించారు సామాన్య ప్రజలు గౌరవంగా బ్రతకాలి అంటే, రైతులు, యువకులు సంతోషంగా ఉండాలి అంటే ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమన్నారు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అందరి దృష్టి ఆకర్షిస్తూ, తన తండ్రి రాజీవ్ గాంధీ హావభావాలతో ప్రజల హృదయాలలో నిలిచిపోయారని స్వార్థం కల్మషం లేని స్వచ్ఛమైన నాయకుడు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ అని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ తెలిపారు