రికవరీ వెంటనే నిలుపుదల చేయాలి
గోదావరిఖని,జనవరి30(జనంసాక్షి): సింగరేణి సంస్థలో సీపీఆర్ రికవరీని వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు అన్నారు. సింగరేణిలో రిటైర్డ్ అనంతరం వైద్య సేవల కోసం ప్రవేశపెట్టిన సీపీఆర్ పథకం కోసం అనేక సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికుల దగ్గర నుంచి నెలకు రూ.2వేలు రికవరీ చేయడం దారుణమన్నారు. ఇలాంటి రికవరీని నిలుపుదల చేయాలన్నారు. కార్మికులకు సీపీఆర్ చేరాలా వద్దా అనే ఆప్షన్ ఇవ్వాలన్నారు. నిర్ధాక్షిణ్యంగా సీపీఆర్ చేర్చి రికవరీ చేయడం తగదన్నారు. అవసరమైతే పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.