రికార్డుల రారాజు కోహ్లీ!

Kanpur: Indian batsman Virat Kohli celebrates his century during 3rd ODI cricket match against New Zealand at Green Park Stadium in Kanpur on Sunday. PTI Photo by Shahbaz Khan (PTI10_29_2017_000106A)

– క్రికెట్‌ చరిత్రలో మరోఘనత దక్కించుకున్న భారత సారధి
– ఐసీసీ ర్యాంకులన్నీ కోహ్లీకే
– కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న మాజీలు
దుబాయ్‌, జనవరి22(జ‌నంసాక్షి) : అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రస్తుత క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డేలు, టెస్టులు, టీ20.. ఫార్మాట్‌ ఏదైనా పరుగులు సాధించడమే తన విధి అన్నట్లుగా కోహ్లీ చెలరేగిపోతున్నాడు. స్వదేశంతో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆసీస్‌ పర్యటనల్లోనూ పరుగుల వరద పారించాడు. 2018లో అతడి ఆటతీరుకు ముచ్చటపడిన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) అన్ని అవార్డులను అతడికే కట్టబెట్టింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లీ రారాజుగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య (ఐసీసీ) ప్రతీ ఏడాదీ ప్రకటించే అవార్డుల్లో ప్రతిష్టాత్మక అవార్డులన్నింటినీ దక్కించుకుని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇన్నేళ్ల చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. దుబాయ్‌లో ఈ ఏడాది అవార్డుల జాబితాను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఐసీసీ ప్రకటించే ప్రతిష్టాత్మక వ్యక్తిగత అవార్డులన్నింటినీ ఈ ఏడాది కోహ్లీయే దక్కించుకున్నాడు. ఏడాది ప్రకటించిన జాబితాలో ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (సర్‌ గ్యార్‌ఫీల్డ్స్‌ ట్రోఫీ), ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, ఐసీసీ టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను కోహ్లీ
చేజిక్కించుకున్నాడు. అలాగే ఐసీసీ ప్రకటించిన ప్రపంచ టెస్ట్‌ టీమ్‌, వన్డే టీమ్‌ కెప్టెన్‌గా కూడా కోహ్లీయే నిలిచాడు. ఈ ఏడాది 13 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 1322 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అలాగే 14 వన్డేల్లో ఆరు శతకాలతో మొత్తం 1202 పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ అన్ని అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా ఒకే ఏడాది ముడూ ప్రతిష్టాత్మక అవార్డులను సాధించిన క్రికెటర్‌ ఇప్పటివరకు ఎవరూ లేరు. కోహ్లీ మాత్రమే తొలిసారి ఆ ఘనత సాధించాడు. కాగా, ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (సర్‌ గ్యార్‌ఫీల్డ్స్‌ ట్రోఫీ)ను గతేడాది కూడా కోహ్లీయే దక్కించుకోవడం విశేషం. ఇలా వరుసగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా కోహ్లీయే దక్కించుకోవడం విశేషం. ఇక ఐసీసీ ప్రకటించిన కోహ్లీ నాయకత్వంలోని టెస్ట్‌ జట్టులో భారత్‌ నుంచి రిషభ్‌ పంత్‌, జస్పీత్ర్‌ బుమ్రాలకు చోటు దక్కింది. అలాగే కోహ్లీ నాయకత్వంలోని వన్డే జట్టులో భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌, జస్పీత్ర్‌ బుమ్రా ఉన్నారు. మాజీ ఆటగాళ్లు, విూడియా, బ్రాడ్‌కాస్టింగ్‌ సభ్యులతో కూడిన ఓటింగ్‌ అకాడవిూ ద్వారా ఈ ఎంపిక పక్రియను ఐసీసీ నిర్వహిస్తుంది.
ఐసీసీ వన్డే, టెస్ట్‌ జట్లు ఇవే..
గతేడాది వన్డే, టెస్టు ఫార్మాట్లకు సంబంధించి ఇంటర్నేషన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) అవార్డులు ప్రకటించింది. గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ అవార్డుతో పాటు టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి ఎంపికై రికార్డు నెలకొల్పాడు. 2018లో వన్డే, టెస్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బ్యాట్స్‌మెన్లు, బౌలర్లతో ఐసీసీ జట్లను ప్రకటించింది. టెస్ట్‌ జట్టులో ఇండియా, న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురేసి చొప్పున ఎంపికయ్యారు. వన్డే జట్టులో ఇండియా, ఇంగ్లండ్‌ నుంచి నలుగురు చొప్పున ఎంపిక కాగా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఒక్కొరు చొప్పున ఎంపికయ్యారు. కోహ్లితో పాటు బుమ్రా కూడా రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.
ఐసీసీ టెస్ట్‌ జట్టు ..
రామ్‌ లాథమ్‌(న్యూజిలాండ్‌), ధిమితి కరుణరత్నె(శ్రీలంక), కేన్‌ విలిమమ్‌సన్‌(న్యూజిలాండ్‌), విరాట్‌ కోహ్లి(ఇండియా), కెప్టెన్‌, కెన్రీ నికోలస్‌(న్యూజిలాండ్‌), రిషబ్‌ పంత్‌(ఇండియా), జాసన్‌ ¬ల్డర్‌(వెస్టిండీస్‌),
కసిగో రబాడ(సౌతాఫ్రికా), నాథయ్‌ లియోన్‌(ఆస్టేల్రియా), జస్పీత్ర్‌ బుమ్రా(ఇండియా), అహమ్మద్‌ అబ్బాస్‌(పాకిస్తాన్‌),
ఐసీసీ వన్డే జట్టు..
రోహిత్‌ శర్మ(ఇండియా), జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్‌), విరాట్‌ కోహ్లి(ఇండియా), కెప్టెన్‌, జోయ్‌ రూట్‌(ఇంగ్లండ్‌), రాస్‌ టేలర్‌(న్యూజిలాండ్‌), జాస్‌ బట్లర్‌(ఇంగ్లండ్‌), వికెట్‌ కీపర్‌, కెన్‌ స్టోక్స్‌(ఇంగ్లండ్‌),
ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌(బంగ్లాదేశ్‌), రషీద్‌ ఖాన్‌(ఆఫ్ఘనిస్తాన్‌), కుల్దీప్‌ యాదవ్‌(ఇండియా), జస్పీత్ర్‌,  బుమ్రా(ఇండియా).