రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు విశ్వాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ దామోదర రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య , ప్రధాన కార్యదర్శి సుబ్బయ్య , గంగారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అనంతరం ఆ సంఘ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా ఎన్.సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొల్లు రాంబాబు, కోశాధికారిగా హామీద్ ఖాన్, అసోసియేట్ అధ్యక్షులుగా రవీందర్ రెడ్డి , ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర రావు , సత్యనారాయణ, రజితా రెడ్డి , కార్యదర్శులుగా విద్యాసాగర్ రావు, సుందరయ్య , ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వీరారెడ్డి , చలమంద , అరుణ జ్యోతి , సహాయ కార్యదర్శులుగా నరసయ్య , పద్మారెడ్డి , ప్రచార కార్యదర్శిగా భాస్కరాచారి , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మోహినుద్దీన్, జగన్మోహన్ రావు, సత్యనారాయణలను ఎన్నుకున్నారు.ఎన్నికల అధికారిగా శ్రీశైలం వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు దండా శ్యామ్ సుందర్ రెడ్డి , నాగేశ్వరరావు, రవీందర్ రెడ్డి, రజిత, శ్రీనివాసరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.