రిటైర్మెంట్‌పై సచిన్‌కు సలహాలు అవసరం లేదు మాస్టర్‌కు రాజీవ్ శుక్లా సపోర్ట్
న్యూఢిల్లీ ,నవంబర్ 26: వరుస వైఫ ల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొం టు న్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు బీసిసిఐ మధ్దతుగా నిలిచింది. రిటై ర్మెంట్ విషయంలో సచిన్ కు ఎవరూ సలహాలు ఇవ్వనవసరం లేదని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్‌శుక్లా అన్నా రు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత శుక్లా దీనిపై స్పందించారు. మాస్టర్ రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలో అతనికే తెలుసని , తనకు ఆట వదిలేయాలనిపించిన రోజున నిర్ణయం ప్రకటిస్తాడని చెప్పారు. ఆట నుండి తప్పుకోవాలంటూ సలహాలు ఇచ్చేవారు అతని గత రికార్డులు చూడాలని వ్యాఖ్యానించారు. నిజానికి న్యూజిలాండ్‌తో సిరీస్ సమయం లోనే మాస్టర్ రిటైర్మెంట్‌పై తీవ్రవిమర్శలు వినిపించాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లోనూ సచిన్ వైఫల్యం కొనసాగుతోంది. గత పది ఇన్నింగ్స్‌లలో సచిన్ 15.3 సగటుతో 153 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మరోసారి మాస్టర్ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతోంది. అయితే మిగిలిన మ్యాచ్‌లలో సచిన్ రాణిస్తాడని శుక్లా ధీమా వ్యక్తం చేశాడు. ముంబై టెస్టులో ఓటమిపై స్పందించిన శుక్లా జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతామని చెప్పారు.