రిమ్స్ వైద్యుడు, ప్రొఫెసర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఆదిలాబాద్ , జనంసాక్షి: రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ ప్రమోద్ జాదవ్, డాక్టర్ ఇబాటేలపై అఖిలపక్ష నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ వారిద్దరిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని అఖిలపక్ష నేతలకు హామీ ఇచ్చారు. రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ ప్రమోద్ జాదవ్, డాక్టర్ ఇబాటేలను తొలగించాలని కోరుతూ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఈరోజు ఉదయం ఆందోళన చేసిన విషయం తెలిసిందే.