రీజెన్సీ ఫ్యాక్టరీ లాకౌట్‌ ఎత్తివేయాలని జీవో జారీ

పాండిచ్చేరి, జనంసాక్షి: తూర్పు గోదావరి జిల్లా యానాం రీజెన్నీ సిరామిక్‌ ఫ్యాక్టరీ లాకౌట్‌ ఎత్తివేయాలని పాండిచ్చేరి లేబర్‌ సెక్రటరీ మంగళవారం జీవో జారీ చేశారు. 2012 జనవరి 27న తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కార్మిక నేత మచ్చా మురళీమోహన్‌ పోలీసుల అదుపులో మృతి చెందడంతో ఆగ్రహించిన కార్మికులు సిరామిక్‌ ఫ్యాక్టరీని తగులబెట్టారు.
ఈ నేపథ్యంలో సిరామిక్‌ యాజమాన్యం అదే సంవత్సరం ఫిబ్రవరిలో లాకౌట్‌ ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘ నేతలు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ నెల 10 వ తేదీన పాండిచ్చేరి లేబర్‌ సెక్రటరీ పీఆర్‌ మీనా లాకౌట్‌ ఎత్తివేయాలని జీవో జారీ చేశారు.